AP: గుంటూరుకు చెందిన అభిరామ్ అనే యువకుడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ టాక్సీలను రూపొందిస్తున్నాడు. ‘మ్యాగ్నమ్ వింగ్స్’ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయోగాలకు ఉపయోగించే పరికరాలన్నీ రాష్ట్రంలోనే తయారు కావడం విశేషం. రెండు సీట్లతో కూడిన ఎయిర్ టాక్సీని రూపొందించి వీ2 అని పేరు పెట్టాడు. ఇది సక్సెస్ కావడంతో తదుపరి వెర్షన్ తయారీలో నిమగ్నమయ్యాడు.