నెల్లూరు: ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేశ్ నాయుడు కోరారు. మనుబోలు మండల రెవెన్యూ అధికారికి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు సర్వే చేయాలని గురువారం వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మనుబోలు మండలంలో బండేపల్లి, మడమనూరుతోపాటు పలు గ్రామాల్లోని చెరువుల అక్రమణలకు గురై ఉన్నాయన్నారు.