VZM: తెర్లాం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉల్లాస్-నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న ఉదయం 10 నుంచి 5గంటల వరకు జరగనున్న ‘ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్’ను విజయవంతం చేయాలని ఎంపీడీవో రాంబాబు అన్నారు. గురువారం వెలుగు కార్యాలయంలో వీవోఏలతో సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షలో పాసైన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తారన్నారు.