KRNL: దేవనకొండ మండలం గద్దెరాళ్ల శ్రీమారెమ్మ అవ్వ దేవర ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దేవర సందర్భంగా హుండీలో వేసిన కానుకలను ఈవో వీరయ్య ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తంగా రూ.13,85,174 వచ్చినట్టు ఈవో తెలిపారు. ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగిందన్నారు.