AP: భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదని సీఎం చంద్రబాబు అన్నారు. రోజూ ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నట్లు తెలిపారు. సమాజహితం కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను ఎప్పుడూ ప్రజాహితం కోసమే పనిచేస్తానని వ్యాఖ్యానించారు. ఏడు కొండలు వెంకటేశ్వరస్వామి సొంతమని.. ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని అధికారులకు ఆదేశించారు.