ఈసారి ఐపీఎల్లో రాజస్థాన్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీనిపై మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ స్పందించాడు. ఆ జట్టు బ్యాటర్లు ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. కోల్కతాతో జరిగిన పోరులో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీని ఎదుర్కోలేకపోయారని అన్నాడు. అలాగే, రాజస్థాన్ బౌలర్లు మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని చెప్పుకొచ్చాడు.