TG: శాసనసభలో రుణమాఫీపై మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రుణమాఫీపై మేము మాట్లాడింది తప్పని మీరు చెబుతున్నారు. రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి ప్రాంతంలోనైనా, సిద్ధిపేటలోనైనా పరిశీలిద్దాం. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగితే బహిరంగ క్షమాపణ చెబుతా. అలా జరగకపోతే మీరు క్షమాపణకు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు.