VZM: నెల్లిమర్ల ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే రహదారి ఈవిఎం గోదాంకి ఎదురుగా రాత్రికి రాత్రే కంటైనర్ వెలసింది. పట్టణంలోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోకి మారడంతో వ్యాపారాలు చేసుకోవడానికి పనిలో పనిగా అక్రమార్కులు సాక్షాత్తు తహశీల్దార్ కార్యాలయం చెంతనే సర్వే నెంబర్ 74లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంటైనర్ ఏర్పాటు చేశారు.