TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. నిన్న సాయంత్రం ఏకంగా 17,162 మెగావాట్లకు చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లు దాటటం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. అయితే డిమాండ్‌కి తగ్గట్లు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేశామని, ఇకపై కూడా అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.