TG: తమ సభ్యులకు మాట్లాడే గడువు ఇవ్వాలన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ‘పార్టీలకు ఉన్న సభ్యుల ప్రకారం సభలో మాట్లాడాలి. కాంగ్రెస్ సభ్యులు సభలో 35 నిమిషాలు మాట్లాడుతారు. BRS సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.. BJP, MIM సభ్యులు 4 నిమిషాలు, సీపీఐ నేతలు 2 నిమిషాలు మాట్లాడాలి. క్రియాశీలకంగా మాట్లాడితే మరింత సమయం మాట్లాడే అవకాశం ఉంటుంది’ అని అన్నారు.