TG: BRS హయాంలో ప్రభుత్వ ఆదాయం 4 రెట్లు పెంచామని మాజీమంత్రి హరీష్ రావు వెల్లడించారు. ‘ప్రధాన ప్రతిపక్షం సూచనలు తీసుకుంటే ప్రభుత్వానికి మేలవుతుంది. 2014లో రూ.62 వేల కోట్ల నుంచి 2023 నాటికి రూ.2.31 లక్షల కోట్లకు ఆదాయాన్ని పెంచాం. ఆదాయ వనరుల వృద్ధిలో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపాం. మా పాలనలో వృద్ధిరేటు ఆకాశం వైపు చూస్తే.. మీ పాలనలో పాతాళం వైపు చూస్తోంది’ అని విమర్శించారు.