ELR: జిల్లాలో గడిచిన 30రోజుల్లో 57,481 ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ జరిగిందని జిల్లా కలెక్టర్ నెట్రి సెల్వి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5ఏళ్లలోపు, 15-17 ఏళ్లు ఉన్న విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఆధార్ అప్డేట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకులు దూరమవుతాయని పేర్కొన్నారు.