SKLM: అక్రమంగా ఇసుక, మద్యం మీద చూపించిన శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం చూపించకపోవడం విడ్డూరంగా ఉందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికార దాహంతో పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు.