గూగుల్ పే, ఫోన్ పేతో పాటు బ్యాంకులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ నెంబర్ యాక్టివ్‌గా లేనట్లయితే.. ఆ నంబర్‌కు ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ ద్వారా డబ్బులు పంపించలేరు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.