ASR: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 సర్వే సకాలంలో పూర్తిచేయాలని జిల్లా పరిషత్ సీఈవో పీ.నారాయణమూర్తి ఆదేశించారు. గురువారం ఆయన కొయ్యూరు మండలంలో పర్యటించారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయం సందర్శించి, రికార్డులు పరిశీలించారు. అనంతరం రాజేంద్రపాలెం గ్రామ సచివాలయం సందర్శించారు. అనంతరం పీ-4 సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.