దిశా సాలియన్ మృతిపై మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ వార్ మొదలైంది. గతంలో ఆమె నటుడు సుశాంత్ రాజ్‌పుత్ దగ్గర మేనేజర్‌గా పని చేసింది. అయితే శివసేన నేత ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి సతీష్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దిశను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని.. మరోసారి కేసు విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఇదంతా BJP కుట్ర అని ఉద్దవ్ ఠాక్రే వర్గం కౌంటర్ ఇస్తున్నారు.