AKP: ఈ నెల 22న నాతవరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సామాజిక ప్రజావేదిక జరగనుందని ఎంపీడీవో ఉషశ్రీ తెలిపారు. 01.04.2023 నుండి 31.03.2024 వరకు జరిగిన పనులపై మండలంలో 31 పంచాయతీల్లో 17వ విడతలో సామాజిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ సామాజిక తనిఖీల అనంతరం గుర్తించిన అంశాలపై చర్చించుట జరుగుతుందన్నారు.