ఛత్తీస్గఢ్లో రెండుచోట్ల ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 26 మంది మావోలు, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోలు మృతి చెందారు. ఈ ఎదురు కాల్పుల్లో జవాన్ రాజు ప్రాణాలు కోల్పోయాడు.