TG: రాష్ట్ర సంస్కృతి ప్రపంచానికి తెలిసేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ‘అందాల పోటీలపై విమర్శలు సరికాదు. దీన్ని మహిళా సాధికారత కోణంలో చూడాలి. ఈ పోటీలకు మొత్తం బడ్జెట్ రూ.54కోట్లు. రూ.27కోట్లు ప్రభుత్వం, మిగతాది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరిస్తుంది. పోటీదారులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తాం’ అని పేర్కొన్నారు.