ATP: కంబదూరు మండలంలోని ములకనూరు గ్రామంలో క్రైస్తవుల స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నారని పాస్టర్లు స్థానిక తహసీల్దార్ బాలకిషన్‌కు గురువారం వినతిపత్రం ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దౌర్జన్యంగా జేసీబీ సాయంతో సమాధులన్నీ ధ్వంసం చేసి దురాక్రమణ చేసుకున్నారని పేర్కొన్నారు. కబ్జా చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.