ప్రకాశం: రేపు సంతమాగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు చిలకలూరిపేటలోని మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు గురిజేపల్లి, 10:30కు చవిటి పాలెం, 11 గంటలకు సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో పర్యటిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.