WGL: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ ఛైర్మన్ శామంతుల శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా బార్ అసోసియేషన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారితో పాటు బార్ ప్రతినిధులు, లీగల్ సెల్ నాయకులు పాల్గొని మిఠాయిలను పంచి సంబరాలు చేశారు.