BPT: వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను వేగవంతం చేయాలని ఎంపీడీవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం కర్లపాలెం సచివాలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపటం, కుటుంబాల ఆదాయం గణనీయంగా పెంచేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంటి దగ్గరే పని కల్పించటం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వేగవంతం చేయాలన్నారు.