CTR: భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపిన ఘటన గంగవరం మండలం కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలు రమ్య శ్రీ వివరాల ప్రకారం, భరత్ అనే వ్యక్తి 6 ఏళ్ల క్రితం తనను ప్రేమించానని చెప్పి వెంట తిరిగాడని, 9 నెలలు క్రితం పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. అయితే, కులం అడ్డం వచ్చిందని వాళ్ల తల్లిదండ్రులు మాటలు విని తనను వదిలేశాడని వాపోయింది.