ELR: నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు కొత్తపేటలో వెలసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి 45వ జాతర మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఏలూరు ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు.