ELR: నూజివీడు మండలం ఓగిరాల తండాకి చెందిన 19 మంది సారా నిందితులను తహసీల్దార్ ఎదుట గురువారం బైండోవర్ చేసినట్లు ప్రాహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఎ.మస్తానయ్య తెలిపారు. తహసీల్దార్ సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ బైండోవర్ ఒక ఏడాది ఉంటుందని, మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే రూ. లక్ష జరిమానా, ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు.