SKLM: టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో శుక్రవారం “లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం” అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకి అధికారులు, మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు హాజరుకావాలని ఆయన కోరారు.