సామెత: ‘ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాడట’
అర్థం: కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కానీ, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్లు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత ఉపయోగిస్తారు.