TG: లగచర్ల దాడి కేసులో కీలక నిందితుడు సురేశ్‌కు కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ మేరకు ఇవాళ, రేపు పోలీసులు సురేశ్‌ను విచారించనున్నారు. 20 మంది రైతుల బెయిల్ పిటిషన్‌పై ఈరోజు కోర్టు తీర్పు వెలువడనుంది. మరోవైపు ఈ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది.