ఢిల్లీలో కాసేపట్లో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పేలుడు ఘటనపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే సైనిక చర్య చేపడితే దౌత్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.