AP: జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. అనుయాయులకే ఇళ్ల పట్టాలు పంచి పెట్టారు. ఇళ్ల నిర్మాణాలకు భూముల కొనుగోలులోనూ అవకతవకలు జరిగాయి. రూ.10,500 కోట్లతో 26 వేల ఎకరాల ప్రైవేట్ భూములు కొనుగోలు చేశారు. వాటిలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయి’ అని ఆరోపించారు.