VZM: మహిళల కోసం ఏర్పాటైన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బొబ్బిలి డీఎస్పీ భవ్య రెడ్డి సూచించారు. బొబ్బిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మహిళా దినోత్సవం వారోత్సవాలు సందర్భంగా సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.