TPT: తిరుపతి పట్టణంలో సోమవారం పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు.రికార్డులు లేని 15 ద్విచక్రవాహనాలు,ఆరు కార్లు, ఒక జేసీబీతోపాటూ మొత్తం 24 వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి తెలిపారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. అనంతరం కొత్త మోటర్ వెహికల్ చట్టం గురించి అవగాహన కల్పించారు.