CTR: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. సోమవారం పుంగనూరులో ఆయన మాట్లాడారు. హంద్రీనీవా కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఓ పత్రికలో ‘నీళ్లురాని కాలువకు నిధులు’ అని ప్రచురించిన వార్తను ఆయన ఖండించారు.