KDP: కడపలో ఇంటర్ ఓపెన్ పరీక్షల ముసుగులో భారీగా వసూళ్ల దందాకు ప్రైవేట్ స్టడీ కోఆర్డినేటర్లు పాల్పడుతున్నారని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశ్ యాదవ్ ఆరోపించారు. పరీక్షల్లో కాపీల ద్వారా పాస్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ. 5000 నుంచి రూ. 8 వేలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.