KDP: రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలాయానికి సోమవారం 1000 తిరుమల తిరుపతి వెంకన్న లడ్డూలు వచ్చాయని ఆలయాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 5న మహా సంప్రోక్షణ ఉన్న కారణంగా ఇంకా ఐదువేల లడ్డూలు రానున్నట్లు వెల్లడించారు. ఒక్కో లడ్డుకు రూ. 50 సమర్పించి లడ్డూలను పొందవచ్చున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.