ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు టీమిండియా సెమీస్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి జట్టు ఎంపిక టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో తుది జట్టులో ఎవరికి చోటు కల్పించాలనేది పెద్ద సవాలుగా మారింది.