HNK: BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని ఆత్మకూరు పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన నిరసనకు హాజరయ్యేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి రాకేష్ రెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో ఆత్మకూరు మండలంలో పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. పోలీస్ యాక్ట్‌ను సాకుగా చూపి తమను అడ్డుకున్నట్టు వారు మండిపడ్డారు.