BDK:పాల్వంచ మండలం పాండురంగాపురం ఏరియాలో పులి సంచారం కలకలం రేపింది. నరసమ్మ తల్లి ఆలయ సమీపంలో కొత్త పోడుకు కొందరు జామాయిల్ చేనుకు వెళ్లి ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా కొంగను తరుముతూ, పులి ట్రాక్టర్‌కు అడ్డు వచ్చిందని స్థానికులు తెలిపారు. వారు కేకలు వేయడంతో పారిపోయిందని ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో ఆ ప్రాంతానికి వెళ్లి అధికారులు పాదముద్రలు సేకరిస్తున్నారు.