SKLM: అన్నదాతా సుఖీభవ పథకానికి రైతులు జులై 10లోగా నమోదు చేయించుకోవాలని సోంపేట మండల వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తి తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో 1బి వచ్చిన రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని అన్నారు. ఆధార్ కార్డుతో పాటు ఇతర పత్రాలు అందజేసి నమోదు చేయించుకోవాలని సూచించారు.