అన్నమయ్య: పీలేరు మండలం వేపులభైలు గ్రామం జంగంపల్లి దగ్గర నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ను టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన తాగు నీటిని అందించడం తమ బాధ్యతని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు.