VSP: జిల్లా కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ టైమ్ 12.30కి ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు.