KRNL: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో డ్యాంలోకి 54,542 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. 19 గేట్లు ఎత్తి 62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 76.746 టీఎంసీల నీరు నిల్వ ఉంది.