నెల్లూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు MLA తెలిపారు.