NLR: వలేటివారిపాలెం మండలం నందలపూరు గ్రామంలో గత నెలలో చెడిపోయిన మంచినీటి ఆర్వో ప్లాంట్లు రిపేర్ చేయించాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. రిపేర్ చేయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.