అన్నమయ్య: స్మశాన వాటికకు రోడ్డులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బి. కొత్తకోట మండలం బడి కాయల పల్లె ఎస్సీ కాలనీ వాసులు వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు స్మశానంలో బైఠాయించి నిరసన తెలిపారు. పలుమార్లు ఈ విషయమై ప్రజాప్రతినిధులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, దారి సమస్య పరిష్కరించాలని కోరారు.