TG: నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కురుమూర్తి ఆలయం వద్ద పురుగుల మందు తాగి ఇద్దరు చనిపోయారు. ప్రవీణ్ కుమార్ (30), అరుణ(25) ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో పెళ్లి జరిగింది. అయితే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.