ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సటీలో గందరగోళం నెలకొంది. వర్సిటీలో ABVP ఆధ్వర్యంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని ప్రదర్శిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు స్క్రీన్‌పైకి రాళ్లు దువ్వారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఘర్షణ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను కాసేపు ఆపేశారు. ఈ దాడి చేసింది వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలేనని ABVP ఆరోపించింది. ఈ సినిమాను 2002 గోద్రా అల్లర్ల ఆధారంగా రూపొందించారు.