లడఖ్‌లో అల్లర్లపై కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రానికి లేహ్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు వెల్లడించింది. రెచ్చగొట్టే వీడియోలను సోషల్ మీడియాల్లో ప్రసారం చేయవద్దని కేంద్రం కోరింది. లడఖ్ ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొంది.