AKP: పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో ఎలమంచి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ గురువారం అమరావతిలో భేటీ అయ్యారు. వార్డు అభివృద్ధిని కోరుతూ కౌన్సిలర్ ఆమరణ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. టీడీపీ సమన్వయకర్త ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి 23వ వార్డుకు రూ. కోటి మంజూరు చేశారు.